ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నర్మదా నది !

Telugu Lo Computer
0


గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వడోదర, భరూచ్, నర్మదా, దాహోద్, పంచమహల్, ఆనంద్, గాంధీనగర్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న 11,900 మందిని షెల్టర్ హోమ్‌లకు తరలించారు. మరో 270 మంది ఒంటరిగా ఉన్న పౌరులను రక్షించారు. సర్దార్ సరోవర్ డ్యామ్ నుంచి నీటి విడుదల కారణంగా గత రెండు రోజులుగా నీటిమట్టం 40 అడుగులకు పెరగడంతో భరూచ్ జిల్లాలోని నర్మదా నది ఒడ్డున నివసిస్తున్న 6 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం నుండి నీటి మట్టం నెమ్మదిగా తగ్గుతున్నప్పటికీ.. భరూచ్, తహసీల్‌, అంక్లేశ్వర్‌లోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ మోకాళ్ల లోతు నీటిలోనే ఉన్నాయి. నర్మదా నది ప్రస్తుత నీటి మట్టం 37.72 అడుగులు ఉండగా.. అంకలేశ్వర్‌ను భరూచ్‌ను కలిపే గోల్డెన్ బ్రిడ్జ్ వద్ద 28 అడుగుల ప్రమాదకర స్థాయి కంటే దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉందని భరూచ్ జిల్లా అత్యవసర ప్రతిస్పందన కేంద్రం అధికారి తెలిపారు. మరోవైపు గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా.. ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. అంతేకాకుండా.. కూలిన చెట్లను తొలగించడం ద్వారా రోడ్లను క్లియర్ చేసే పనిలో ఉన్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)