జనసేనకు గాజు గ్లాసును కొనసాగిస్తూ ఈసీ నిర్ణయం

Telugu Lo Computer
0


నసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును కొనసాగిస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనసేన పార్టీకి సమాచారం పంపింది. దీంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసీ నిర్ణయంపై స్పందించారు.వచ్చే ఎన్నికలకు గ్లాస్ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్ ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్ సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు నాడు పోటీలో నిలిచారని పవన్ తెలిపారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రజలకు సేవ చేయడానికి జనసేన అభ్యర్థులు సన్నద్ధమైన తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషదాయకమని ఈసీ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, యావన్మంది సిబ్బందికి పేరుపేరునా నా తరఫున, జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)