కేబుల్‌ కారు చిక్కుకుపోయిన పాఠశాల విద్యార్దులు !

Telugu Lo Computer
0


పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని లోయలను దాటేందుకు వినియోగించే కేబుల్‌ కారులో పాఠశాలకు వెళ్లే ఆరు చిన్నారులతో సహా ఎనిమిది మంది చిక్కుకుపోయారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఆ ప్రాంతంలో నివసించే వారు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లాలంటే ఆ లోయను దాటాల్సి ఉంటుంది. ఇందుకోసం వారు నిత్యం కేబుల్‌ కారును వినియోగిస్తారు. అయితే, ప్రయాణం ప్రారంభించిన కాసేపటికి కేబుల్‌ తెగిపోయింది. దీంతో చిన్నారులతో సహా ఎనిమిది మంది 1200 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. అందులో ఉన్న ఒక వ్యక్తి ఫోను ద్వారా ప్రమాదం గురించి స్థానిక మీడియాకు వెల్లడించారు. ''ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా కేబుల్‌ కారు ఆగిపోయింది. చిన్నారులతో సహా మేమంతా ఇక్కడ చిక్కుకుపోయాం. భయంతో ఒక వ్యక్తి స్పృహ కోల్పోయాడు. ఉదయం ఏడు గంటల నుంచి ఇక్కడే ఉండిపోయాం. ఇక్కడ పరిస్థితి ఏమీ బాలేదు. మా సమీపంలో ఒక హెలికాఫ్టర్‌ తిరిగింది. కానీ, మాకు ఎలాంటి సహాయం చేయకుండా వెళ్లిపోయింది. ఆ దేవుడే మమ్మల్ని కాపాడాలి''అంటూ వివరించారు. ''దాదాపు 1200 అడుగుల ఎత్తులో వారంతా చిక్కుపోయారు. హెలికాఫ్టర్‌ లేకుండా వారిని కాపాడడం అసాధ్యం. అందుకోసం ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రభుత్వాన్ని హెలికాఫ్టర్‌ను పంపించాలని కోరాము'' అని రెస్య్కూ అధికారి జుల్ఫికర్‌ ఖాన్‌ తెలిపారు. దీంతో స్థానిక అధికారులు స్పందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)