అంబేద్కర్ విగ్రహం ముందు ఏడ్చిన ఎమ్మెల్యే రాజయ్య !

Telugu Lo Computer
0


తెలంగాణ లోని జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోవడంతో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కంటతడి పెట్టుకున్నారు. ఇవాళ క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యాడు. ఈ క్రమంలో వారితో మాట్లాడుతూ ఒక్కసారిగా భోరున విలపించారు. ఆ తర్వాత కార్యకర్తలతో కలిసి  అంబేద్కర్  విగ్రహం ముందు పడుకొని వెక్కివెక్కి ఏడ్చారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు ఈసారి బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదు. ఈ నియోజకవర్గం నుంచి రాజయ్య 2014, 2018లో నుంచి గెలిచారు. అయితే ఈసారి ఈ టిక్కెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఇవ్వడంతో తనకు టిక్కెట్ రాకపోవడంతో రాజయ్య కన్నీటిపర్యంతమయ్యారు. నాకు సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి. అందరూ సమన్వయం పాటించండి. పసిపిల్లల డాక్టర్ అయిన నేను, అంబేద్కర్ భిక్ష వల్ల ఎమ్మెల్యే అయ్యాను. దయచేసి ఎవరినీ బాధ పెట్టొద్దు అని ఆయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయి. ప్రతి గ్రామానికి సీడీఎఫ్ కింద 3 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. కూడా పరిధిలోని 5 మండలాలకు 12 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతాయని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. సీఎం కేసీఆర్ ఉన్నత స్థానం కల్పిస్తామని తనకు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఇప్పుడు ఉన్న స్థానం కంటే మంచి స్థానం తనకు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అధినేత మాటను గౌరవించి తాను ముందుకు సాగుతానన్నారు. కేసీఆర్ గీసిన గీతను తాను దాటేది లేదని, ఆయన ఆదేశాలు పాటిస్తానని రాజయ్య స్పష్టం చేశారు. డిసెంబర్ 11 వరకు తానే ఎమ్మెల్యేగానే ఉంటానని, నిరంతరం ప్రజల్లో ఉండటమే తనకు ఇష్టమని రాజయ్య చెప్పుకొచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)