బ్రిక్స్‌ సమావేశాలకు బయలుదేరిన మోడీ - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 22 August 2023

బ్రిక్స్‌ సమావేశాలకు బయలుదేరిన మోడీ


బ్రిక్స్ సభ్య దేశాలు భవిష్యత్తులో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి వ్యవస్థీకృత అభివృద్ధిని సమీక్షించుకోవడానికి జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న సమావేశం కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు. ఈసారి బ్రిక్స్ సమావేశం వివిధ రంగాల్లో సభ్య దేశాల మధ్య బలమైన సహకారానికి సంబంధించిన అజెండాను పరిశీలిస్తుందని వెల్లడించారు. " పేద దేశాలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు బహుళ పక్ష వ్యవస్థల సంస్కరణలను చర్చించడానికి బ్రిక్స్ విలువైన వేదికగా మారిందని భావిస్తున్నాను" అని మోడీ తన ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం ప్రధాని ఎక్స్ (ట్విటర్)లో ఓ పోస్ట్ చేశారు. జొహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్తున్నాను. బ్రిక్స్ ఆఫ్రికా, బ్రిక్స్‌ప్లస్ సమావేశాలు కూడా జరగనున్నాయి. పేద దేశాల సమస్యలు, ఇతర అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు ఇది వేదికగా మారింది" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఆగస్టు 2224 వరకు 15 వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం గ్రీస్ పర్యటనకు వెళ్తారు. 2019 తర్వాత బ్రిక్స్ దేశాధినేతలు వ్యక్తిగతంగా హాజరవుతున్న తొలి సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది. ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బదులు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ సదస్సులో పాల్గొంటారు. 

No comments:

Post a Comment