జావెలిన్‌ త్రో ఫైనల్లో అడుగుపెట్టిన ముగ్గురు భారత అథ్లెట్లు !

Telugu Lo Computer
0


హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌-2023లో జావెలిన్‌ త్రో విభాగంలో ఏకంగా ముగ్గురు  భారత అథ్లెట్లు ఫైనల్‌లో అడుపెట్టడం ద్వారా ఈ ఘనత సాధించారు. సింగిల్‌ ఎడిషన్‌ ఆఫ్‌ వరల్డ్‌ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో ఏకంగా ముగ్గురు ఇండియన్‌ జావెలిన్‌ త్రోయర్స్‌ ఫైనల్‌లో అడుగుపెట్టడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ అరుదైన ఘనత సాధించిన అథ్లెట్స్‌లో టోక్యో ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ నీరజ్‌ చోప్రాతోపాటు డీపీ మను, కిషోర్‌ జెనా ఉన్నారు. నీరజ్‌ చోప్రా ఈటెను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌ క్వాలియర్స్‌లో అగ్రస్థానంలో ఉండగా, డీపీ మను 81.31 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో, కిషోర్‌ జెనా 80.55 మీటర్ల దూరం విసిరి 9వ స్థానంలో ఉన్నాడు. భారత్‌ కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11.45 గంటలకు ఫైనల్‌ జరుగనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)