డెలివరీ బాయ్ ని కత్తితో పొడిచిన మహిళ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 25 August 2023

డెలివరీ బాయ్ ని కత్తితో పొడిచిన మహిళ !


ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 23లోని ఆన్‌లైన్ కిరాణా ప్లాట్‌ఫారమ్‌లో పనిచేస్తున్న డెలివరీ బాయ్‌ అడ్రస్ అడిగిన తర్వాత 42 ఏళ్ల మహిళ పలుమార్లు అతన్ని కత్తితో పొడిచింది. నిందితురాలు డెలివరీ బాయ్‌పై కత్తితో దాడి చెయ్యడమే కాకుండా అతని ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను అదుపు చేసేందుకు ప్రయత్నించడంతో హైడ్రామా చోటుచేసుకుంది. అంతేకాకుండా పోలీసులను కూడా కత్తితో బెదిరించిన ఆమె వారి మీద కూడా దాడి చెయ్యడం కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి గోలు అనే డెలివరీ బాయ్ మెటీరియల్స్ డెలివరీ చేసేందుకు ద్వారకా సెక్టార్ 23లోని డీడీఏ ఫ్లాట్‌కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు అన్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను నిలిపిన డెలవరీ బాయ్ గోలు మేడమ్ ఈ అడ్రస్ ఎక్కడా అని అడిగాడు. ఆ సమయంలో రెచ్చిపోయిన మహిళ రేయ్ నన్నే అడ్రస్ అడుగుతావా అంటూ డెలవరీ బాయ్ గోలును బూతులు తిడుతూ దుర్భాషలాడినట్లు తెలిసింది. కొంత సేపటికి డెలవరీ బాయ్ గోలుకు ఏమీ అర్థం కాకముందే ఆమె చేతిలోకి కత్తి తీసుకుని అతన్ని పొడిచింది. అనంతరం భయపడిపోయిన డెలవరీ బాయ్ అతని స్కూటర్‌ను రోడ్డు మీద వదిలి పారిపోయాడు. దీంతో ఆ మహిళ అతని స్కూటర్‌ను కింద పడేసి, కత్తితో టైరుకు పంక్చర్ చేసేందుకు ప్రయత్నించింది. అలాగే ఆమె డెలవరీ బాయ్ బైక్ తాళం తీసి సమీపంలోని చెత్తలోకి విసిరిందని తెలిసింది. అంతటితో సరిపెట్టుకోని మహిళ మళ్లీ డెలివరీ బాయ్‌ గోలును వెంబడించి పలుమార్లు అతని మీద కత్తితో దాడి చెయ్యడానికి ప్రయత్నించింది. మహిళ రాద్దాంతం గమనించిన స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన పోలీసులపై ఆ మహిళ దాడి చేసేందుకు ప్రయత్నించి వారి మీద గొడవకు దిగింది. తరువాత సమీపంలో చిక్కిన కర్ర తీసుకొని పోలీసు వాహనంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. చివరకు ఆమెను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించే ముందు ఆమె ఒక మహిళా పోలీసు అధికారి జుట్టును లాగడం, ఆమె ముఖం మీద గోళ్లతో గీతలు పెట్టడానికి ప్రయత్నించడంతో ఆమెను అడ్డుకుని అరెస్టు చేశామని, ఈ మేరకు ఆమె మీద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 

No comments:

Post a Comment