నల్ల జామ కాయలు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


దేశంలో కొన్ని ప్రాంతాల్లో నల్లజామ పంటను పండిస్తున్నారు. ఇందులో అధికంగా పోషకాలు ఉంటాయి. పైన నల్లగా ఉన్న ఈ జామ లోపల ఎర్రటి గుజ్జుతో ఆకట్టుకుంటుంది. ఇందులో యాంటిఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మరో విశేషమేమిటంటే ఈ జామ కాయను బీహార్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు  అభివృద్ధి చేశారు. ఈ జామలో విటమిన్ సి, విటమిన్ ఎ, బి, ఇతర మల్టీ విటమిన్లతో పాటు మినరల్స్, అత్యధిక మోతాదులో కాల్షియం, ఐరన్, కొంత మొత్తంలో ప్రొటీన్ లభిస్తుంది. ఇవి తింటే శరీరంలో వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించవట. జీర్ణ సంబంధింత సమస్యలతో బాధపడే వారు ఈ జామకాయలు తింటే ఉపశమనం లభిస్తుందట. డయాబెటిస్‌తో బాధపడేవారు ప్రతి రోజు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉండదట. రక్తహీనత తగ్గి.. ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది. మలబద్ధకం, ఇతర ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అయితే వీటి ధర మామూలు జామ కాయలతో పోలిస్తే కాస్త ఎక్కువనే చెప్పాలి.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)