ఖైదీతో కలిసి అంబులెన్స్లో పోలీసుల మందు పార్టీ !

Telugu Lo Computer
0


పంజాబ్‌ రాష్ట్రం హోషియార్‌పూర్‌ సెంట్రల్ జైలులోని అంబులెన్స్ లో ఇద్దరు పోలీసులు మద్యం సేవించారు. వీరు ఓ ఖైదీతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. అంబులెన్స్ ను డ్రైవర్ నడుపుతుండగా, రెడ్ టీ షర్ట్ ధరించిన ఖైదీతో కలిసి అంబులెన్స్ లో చీర్స్ కొడుతూ ఒక్కో పెగ్గు లాగించారు. అయితే పోలీసులు మందు తాగుతుండగా వెనకాల వాహనంలోని ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఖాకీల మందు పార్టీ బండారం బయటపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మద్యం సేవించిన పోలీసులపై శాఖాపరమైన విచారణ ప్రారంభించినట్లు సమాచారం. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)