స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులను 'స్పెషల్‌ టమాటా ఫోర్స్‌'గా వ్యవహరించాలి !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఈ నెల 10న రామ్‌జీ, నయీమ్ ఖాన్ అనే కూరగాయల వ్యాపారులు రాత్రి వేళ తమ షాపులు మూసి ఇళ్లకు వెళ్లారు. మరునాడు వచ్చి చూడగా షాపులో ఉన్న 26 కేజీల టమాటాలు, 25 కేజీల మిర్చి, 8 కేజీల అల్లం చోరీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజీల్లో టమాటాలు, మిర్చి, అల్లం దొంగతనం చేసిన నిందితులను కమతా ప్రసాద్, మహ్మద్ ఇస్లాంగా గుర్తించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. టమాటాల చోరీకి సంబంధించిన ఈ వార్త ఉత్తరప్రదేశ్‌లోని ప్రతికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ దీనిపై స్పందించారు. టమాటా చోరీ కేసులపై దర్యాప్తు జరిపే స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్టీఎఫ్‌) పోలీసులను 'స్పెషల్‌ టమాటా ఫోర్స్‌'గా వ్యవహరించాలని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక ట్వీట్‌ చేశారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)