పిల్లల్లో ఆటిజం లక్షణాలను గుర్తించే యాప్‌

Telugu Lo Computer
0


పిల్లల్లో ఆటిజం, న్యూరోడెవలప్‌మెంటల్‌ డిజార్డర్లను గుర్తించే సరికొత్త యాప్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ యాప్‌నకు 'స్టార్ట్‌' అని పేరు పెట్టారు. భారత్, అమెరికా, బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు దీనిని రూపొందించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నివసించే 2-7 ఏండ్ల వయసున్న 131 మంది పిల్లలపై ఈ యాప్‌ను పరీక్షించారు. న్యూరోడెవలప్‌మెంటల్‌ డిజార్డర్లను 86 శాతం కచ్చితత్వంతో, ఆటిజాన్ని 76 శాతం కచ్చితత్వంతో ఈ యాప్‌ గుర్తిస్తుందని పరిశోధకులు తెలిపారు. పిల్లల్లో ముందుగానే ఆటిజం లక్షణాలను గుర్తించి, వారికి తగిన చికిత్స అందించేందుకు ఈ యాప్‌ దోహదపడుతుందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ప్రతి 1000 మంది చిన్నారుల్లో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)