బీట్‌రూట్‌ జ్యూస్‌ - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


బీట్‌రూట్‌ లో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌తో తయారు చేసిన ఆహారాలను ప్రతిరోజు తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌లో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్‌ వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనిని సలాడ్‌లో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌లో ఫోలేట్‌ పుష్కలంగా ఉంటుంది.. ఇది కణాల పెరుగుదలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. బీట్‌రూట్‌లో ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు బీట్‌రూట్‌ జ్యూస్‌ను తాగడం వల్ల రక్తహీనత, రోగ నిరోధక శక్తి సమస్యలనుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. బీట్‌రూట్‌లో అధిక మోతాదులో లభించే నైట్రేట్‌ వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడమే కాకుండా రక్తంలో గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా రక్తప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే బీట్‌రూట్‌ శరీరంలో శక్తి స్థాయులను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తరచు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. బీట్‌రూట్‌ ఉండే గుణాలు చర్మాన్ని మెరిపించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే ఫోలేట్, ఫైబర్‌ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. దీని రసాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. బీట్‌రూట్‌ రసాన్ని తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.   https://t.me/offerbazaramzon


Post a Comment

0Comments

Post a Comment (0)