తాజా ఘర్షణల్లో నలుగురు మృతి

Telugu Lo Computer
0


ణిపూర్‌ లోని ఇంఫాల్‌, కంగ్లా కోట సమీపంలో రెండు వాహనాలకు దాదాపు 150-200 మంది ఉన్న ఓ గుంపు నిప్పు పెట్టింది. ఆ గుంపే పోలీసుల నుండి ఆయుధాలను లాక్కోవడానికి ప్రయత్నించింది. అయితే ఈ గుంపుపై భద్రతా దళాలు కాల్పులు జరిపినట్లు శనివారం అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం నష్టం సంభవించినట్లు సమాచారం లేదని అధికారులు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి కంగ్లా కోట సమీపంలోని మహాబలి రోడ్డు వద్ద 150-200 మంది ఉన్న ఓ గుంపు రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో వెంటనే ఆర్మీ దళాలు అక్కడికి చేరుకుని ఆ గుంపును చెదరగొట్టారు. ఇక అదే సమయంలో ప్యాలెస్‌ కాంపౌండ్‌లో శుక్రవారం రాత్రి 12.30 గంటల సమయంలో ఘర్షణలు చేయబోయే మరో గుంపును ఆర్మీ, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బృందం చెదరగొట్టింది. అయితే ఇంఫాల్‌ తూర్పు జల్లాలోని యైంగాంగ్‌పోక్పి సమీపలో శుక్రవారం అర్ధరాత్రి వరకూ అడపాదడపా కాల్పులు జరిగినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. కాగా, బిష్ణుపూర్‌ జిల్లాలోని కంగ్వారు ప్రాంతంలో గురువారం, శుక్రవారాల్లో రాత్రిపూట మైటీస్‌, కుకీస్‌ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఓ పోలీస్‌ కమాండ్‌, యువకుడుతో సహా నలుగురు వ్యక్తులు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంతం చుట్టూ భద్రతా దళాలు చుట్టుముట్టాయి. మే 3వ తేదీ నుంచి మణిపూర్‌లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. వీటివల్ల ఇప్పటివరకు దాదాపు మూడు వేల మంది గాయాలపాలయ్యారు. 120 మంది మృతి చెందారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)