ప్రపంచంలోనే తొలిసారిగా పసి బిడ్డకు కిడ్నీ సర్జరీ

Telugu Lo Computer
0


ఢిల్లీ ఎయిమ్స్ లో మూడు నెలల పసిబిడ్డకు కిడ్నీ శస్త్ర చికిత్స జరిగింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేసి పసి బిడ్డకు రెండు మూత్రపిండాల్లో తలెత్తిన సమస్యను తీర్చారు. మూత్రపిండాల నుంచి మూత్రాశయానికి మూత్ర ప్రవాహంలో ఏర్పడిన సమస్యతో పుట్టిన బిడ్డకు మూడు నెల్లల తరువాత ఈ సర్జరీ చేశామని వెల్లడించారు. ఈ సర్జరీని గత సంవత్సరం డిసెంబరులోనే పీడియాట్రిక్ విభాగం నిర్వహించిందని తెలిపారు. సర్జరీ తరువాత పసి బిడ్డను మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ చేశామని ఎయిమ్స్ ప్రకటించింది. ఆ తరువాత రినో గ్రామ్ పరీక్ష నిర్వహించి సర్జరీ విజయవంతమైందని నిర్థారించుకున్నామని ఎయిమ్స్ ఫ్రొఫెసర్ డాక్టర్ విశేష్ జైన్ చెప్పారు. కేవలం మూడు నెలల వయసున్న బిడ్డకు కిడ్నీ సర్జరీ చేయడమనేది ప్రపంచంలోనే ఇది తొలిసారి అని ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)