బాధ్యతలు చేపట్టిన అర్జున్ రామ్ మేఘవాల్ !

Telugu Lo Computer
0


అర్జున్ రామ్ మేఘవాల్ ఈ రోజు న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే న్యాయవ్యవస్థతో ఎలాంటి ఘర్షణ లేదని, అందరికీ సత్వర న్యాయం జరిగేలా చూడడమే తన ప్రాధాన్యత అని ఆయన ప్రకటించారు. మేఘ వాల్ డిసెంబర్ 20, 1953న రాజస్థాన్‌లోని బికనీర్‌లో సంప్రదాయ నేత కార్మికుల కుటుంబంలో జన్మించారు. అతను పనా దేవిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈయన మాజీ సివిల్ సర్వీస్ అధికారి. మేఘవాల్ ఎంబీఏ డిగ్రీతో పాటు లా లో బ్యాచిలర్ డిగ్రీ, పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ చేశారు. 1982లో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. 2009లో రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి 15వ లోక్‌సభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. 2010 నుంచి మేఘవాల్ బిజెపి జాతీయ కార్యవర్గంలోకి ఉన్నారు. పార్టీ రాజస్థాన్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013లో ఆయనకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. 69 ఏళ్ల ఆయన ప్రస్తుతం మూడోసారి ఎంపీగా కొనసాగుతున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మేఘవాల్ కు న్యాయ శాఖ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికలకు ముందు, బికనీర్‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా "చట్టవిరుద్ధమైన" భూ ఒప్పందాలను బయటకు తీయడంతో మేఘవాల్  ప్రాముఖ్యతను పొందారు. ఆ సంవత్సరం కేంద్రంలో బిజెపి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడు, మేఘవాల్ మూడు లక్షల ఓట్ల భారీ తేడాతో కాంగ్రెస్‌కు చెందిన శంకర్ పన్నును ఓడించి లోక్‌సభలో బిజెపి చీఫ్ విప్ అయ్యారు. 2016లో, మేఘవాల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చేర్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)