మనిషి చనిపోయే ముందు మెదడు మరింత యాక్టివేట్ అవుతుంది ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 2 May 2023

మనిషి చనిపోయే ముందు మెదడు మరింత యాక్టివేట్ అవుతుంది !


మానవ మెదడు ఏవిధంగా ప్రవర్తిస్తుందనే విషయంపై తాజాగా అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. మరణానికి చేరువలో కోమాలో ఉన్న నలుగురు వ్యక్తుల బ్రెయిన్స్ పై పరిశోధకులు అధ్యయనం చేశారు. అయితే అనూహ్యంగా మరణానికి ముందు మానవ మెదడు యాక్టవిటీ పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ సమయంలో మనిషి మెదడు పనితీరు మిస్టరీగా ఉందని వెల్లడించారు. వీరి బ్రెయిన్ పని తీరును ఈసీజీ,ఈఈజీ సంకేతాలతో విశ్లేషించారు. చాలా ఏళ్లుగా మనిషి చనిపోయే ముందు మానవ మెదడు ఎలా ప్రవర్తిస్తుంది అని శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. చనిపోయే ముందు ఇద్దరిలో 'గామా వేవ్స్' పెరిగినట్లు తేలింది. ఇవి కార్డియార్ అరెస్ట్ అయిన సందర్భంలో చూస్తుంటామని పరిశోధకులు తెలిపారు. వెంటిలేటర్ సపోర్టు తొలగించిన తర్వాత ఇద్దరిలో స్పృహతో సంబంధం ఉన్న గామా వేవ్ యాక్టివిటీలో పెరుగుదల గమనించబడింది. మెదడులోని 'హాట్ జోన్' అయిన కలలు కనే ప్రాంతం, స్పృహతో సంబంధం ఉండే ప్రాంతంలో ఈ చర్యలను పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం ప్రకారం చనిపోయే ముందు మెదడు మరింత యాక్టివేట్ అవుతుందని పరిశోధకులు గుర్తించారు. 2014 నుంచి న్యూరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మరణించడానికి సిద్ధంగా ఉన్న ఇద్దరు రోగుల్లో మరణానికి ముందు వారి మెదడులో గామా తరంగాలు లాంగ్ రేంజ్ కనెక్షన్లను మెదడు రెండు అర్థగోళాల మధ్య పెరిగినట్లు గుర్తించారు. కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడు పనితీరు పూర్తిగా అర్థం కాలేదని పరిశోధకలు తెలిపారు. స్పృహ కోల్పోవడం కార్డియాక్ అరెస్ట్ తో సంబధాన్ని కలిగి ఉంటుదని, అయితే మరణిస్తున్న సమయంలో రోగులు రహస్య స్పృహ కలిగి ఉండగలరా అనేది అస్పష్టంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

No comments:

Post a Comment