హత్య కేసులో ఎంపీ నందిగం సురేష్‌ బావ అరెస్టు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామం ఉద్దండరాయునిపాలెంలో గత నెల 21న ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గ్రామానికి చెందిన మెడబలిమి ఆది నరసింహులు హత్య కేసులో బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ బావ ప్రత్తిపాటి వెంకటరత్నంను పోలీసులు అరెస్టు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు ఆది నరసింహులు ఆరేళ్ల కిందట తన భార్యతో కలిసి ఉద్దండరాయునిపాలెం వచ్చి ఉంటున్నారు. తన భార్యతో వెంకటరత్నం చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో గత నెల 21న నరసింహులు తాగిన మైకంలో రత్నంతో ఘర్షణ పడ్డాడు. ఆ సమయంలో నరసింహులు కింద పడిపోయారు. అదే సమయంలో నిందితుడు కాలితో నరసింహులు వృషణాలపై బలంగా కొట్టగా స్పృహ కోల్పోయారు. కొన ఊపిరితో ఉన్న నరసింహులు ఛాతీపై బలంగా గట్టిగా నొక్కడంతో అతను ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం నివేదికలోనూ వృషణాలపై వాపు ఉందని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గత నెల 27న వెంకటరత్నంను అరెస్టు చేసి విచారించారు. గత నెల 28న మంగళగిరి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)