పర్వతం ఎక్కుతుండగా 200 పురాతన వెండి నాణేలు లభ్యం !

Telugu Lo Computer
0


ఇటలీలోని లివోర్నో నగరంలో కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు టుస్కాన్ అడవిలో హైకింగ్ చేస్తుండగా 200 పురాతన వెండి నాణేలు లభ్యమయ్యాయి. ఈ వెండి నాణేల్లో దాదాపు 175 రోమన్ సామ్రాజ్యానికి చెందినవి. ఒకట్రెండు మినహా మిగిలిన నాణేలు ఏవి కూడా చెక్కుచెదరలేదని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఘటన నవంబర్ 2021లో జరిగింది. జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. నాణేల మూలాలు, ఏయే కాలాలకు చెందినవి, వాటి డాక్యుమెంటేషన్ లాంటివి కనుగొనేందుకు పురావస్తు బృందం సుమారు సంవత్సరం పాటు రీసెర్చ్ కొనసాగించింది. ‘ఈ నిధి ఓ వ్యక్తి జీవితం, లేదా ఒక సైనికుడి జీవితం, లేదా ఎవరైనా ఇంటి కోసం దాచుకున్న ఆశల చిరునామా అయ్యి ఉండొచ్చునని’ సీఎన్ఎన్‌కి పురావస్తు బృందంలోని అధికారి లోరెల్లా అల్డెరిఘి చెప్పారు. అయితే ఇక్కడ విచారకరమైన నిజమేంటంటే ఆ ఆశలను సాధిద్దాం అనుకునేలోపు నాణేల యజమాని మరణించాడని చెప్పుకొచ్చారు. 91 నుంచి 88 బీసీ  మధ్య రోమ్‌కి చెందిన ఓ మాజీ సైనికుడివి ఈ నాణేలు కావచ్చునని గుర్తించారు. ఆ సమయంలో ఈ నాణేలను ఓ మట్టి కుండలో దాచి పాతిపెట్టినట్లుగా బృందం తెలిపింది. కాగా, వీటిని మే 5 నుంచి జూలై 2 వరకు లివోర్నోలోని మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ఆఫ్ మెడిటరేనియన్‌లో ప్రదర్శనకు ఉంచుతామని స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)