మొక్కజొన్న పంటలో గంజాయి సాగు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 19 May 2023

మొక్కజొన్న పంటలో గంజాయి సాగు !


గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా షెహ్రా తాలూకా బోరియా గ్రామంలో మొక్కజొన్న తోట లోపల గంజాయి సాగు చేస్తున్  ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రిటైర్డ్ బస్ కండక్టర్ శంకర్ మావ్జీభాయ్ దోడియార్ తన ఇంటి సమీపంలో ఉన్న పొలంలో మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. అంతర్ పంటగా గంజాయిని సీక్రెట్‌ సాగు చేస్తున్నాడు.  ఈ సమాచారం స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అధికారులకు అందడంతో అకస్మాత్తుగాపొలంలో దాడులు చేశారు. సోదాల్లో పొలంలో సాగు చేసిన దాదాపు 33 పచ్చి గంజాయి మొక్కల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయి బరువు 54.72 కిలోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ రూ.5.47 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

No comments:

Post a Comment