కరెంట్ బిల్లులు చెల్లించమంటున్నారు !

Telugu Lo Computer
0


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించాక ఇంకా ప్రభుత్వాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల ప్రజలు విద్యుత్‌ బిల్లులు చెల్లించమంటున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు తమ బిల్లులు చెల్లిస్తారని విద్యుత్‌ అధికారులకు చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీంతో కొప్పల్, చిత్రదుర్గ కలబురగి వంటి జిల్లాల్లోని పలు గ్రామాల ప్రజలు విద్యుత్ బిల్లుల చెల్లింపును నిలిపివేశారు. అలాగే ఉచిత విద్యుత్‌పై తమకు హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ గెలవడంతో విద్యుత్‌ బిల్లులు చెల్లించే అవసరం లేదని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. వారు ఇచ్చిన హామీల వల్ల విద్యుత్‌ బిల్లులు చెల్లించబోమంటున్నారు. అలాగే విద్యుత్‌ బిల్లుల చెల్లింపుల కోసం తమ ఇళ్లకు కూడా రావద్దని విద్యుత్‌ సిబ్బందికి తెలిపారు. దీంతో ఏం చెయ్యాలో తెలియక అధికారులు, విద్యుత్ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)