'ఆర్ఆర్ఆర్' రికార్డును దాటిన 'బలగం'

Telugu Lo Computer
0


బలగం టీవీలో ప్రదర్శించడంతో ఊహించని రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఏకంగా ఆర్ఆర్ఆర్ రేటింగ్ నే దాటేసింది. మే 7న ఈ చిత్రాన్ని స్టార్ మాలో టెలికాస్ట్ చేశారు. తొలిసారిగా టీవీలో రావడంతో థియేటర్లలో మిస్ అయిన వారు వీక్షించారు. దీంతో 14.3 రేటింగ్ దక్కించుకొని బుల్లితెరపైనా 'బలగం' సత్తా చాటింది. ఆర్ఆర్ఆర్ కు 19 రేటింగ్ రావడం విశేషం. హైదరాబాద్ నగరంలో బలగానికి 22 రేటింగ్ రేటింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు బలగం చిత్రం అవార్డుల పంట కూడా పండిస్తోంది. అంతర్జాయతీయ స్థాయిలోనూ అవార్డులను సొంతం చేసుకుంటుండటం విశేషం. 40కి పైగా అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఈ ఏడాది జరుగుతున్న 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్ సిసిరోలియో అవార్డుని అందుకున్నాడు. ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఏకంగా 9 అవార్డులను సాధించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)