కుక్కను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన పోర్‌షె లగ్జరీ స్పోర్ట్స్ కారు !

Telugu Lo Computer
0


 హర్యానా లోని గురుగ్రామ్‌లో రూ.2 కోట్లకు పైగా విలువ చేసే పోర్‌షె లగ్జరీ స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టి కాలి బూడిదైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మన్‌కీరత్ సింగ్‌ (35) అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున ఈ కారులో వెళ్తున్నాడు. కారు అదపుతప్పి రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టాడు. దీంతో ఇంజిన్‌లో నుంచి మంటలు చెలరేగాయి. మన్‌కీరత్ ఎలాగోలా కాలిన గాయాలతో బయటపడ్డాడు. వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో కారు భాగాలు 100 మీటర్ల దూరం వరకు వెళ్లిపడ్డాయి. చక్రాలు ఊడిపోయాయి. ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయే క్రమంలో మన్‌కీరత్ సింగ్‌ కారుపై నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)