భార్యే భర్తకు భరణం చెల్లించాలి !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర లోని పూణెకు చెందిన ఓ యువ జంట విడాకుల కోసం సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఈకేసులో భర్త వయస్సు 38, అతను చదివింది బీటెక్. భార్య వయసు 33. ఆమె ఎంటెక్ చేసింది. దీంతో సదరు భర్త నా భార్య నాకంటే ఎక్కువ చదువుకుంది కాబట్టి ఆమె నాకు భరణం ఇవ్వాలని 2022 మార్చిలో భరణం కోసం కోర్టులో పిటీషన్ వేశాడు. భార్య నుంచి తనకు భరణం ఇప్పించాలని కోర్టును అభ్యర్థించాడు. దీంతో షాక్ అయిన సదరు భార్య ఇదేంటీ నేను భరణం ఇవ్వటమేంటీ, చట్టాల ప్రకారం అతనే నాకు భరణం ఇవ్వాలని కోరుతూ శాశ్వత భరణం కోసం కౌంటర్‌ పిటీషన్ దాఖలు చేసింది. అతనే నాకు భరణం ఇవ్వాలని వాదించింది. ఈ విడాకుల కేసును విచారించిన పుణే సివిల్ జడ్జ్ ఎస్వీ ఫుల్బాంధే అతని కంటే ఆమె ఎక్కువ చదువుకుంది పైగా చదువుకు సంబంధించి తప్పుడు పత్రాలను కోర్టుకు సమర్పించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిందంటూ భరణం కింద భర్తకు రూ.50 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ సంచలన తీర్పు కాస్తా భరణం, జెండర్ చర్చకు కారణమైంది. ముఖ్యంగా విడాకుల కేసుల్లో జెండర్, భరణం గురించి చర్చకు దారితీసింది. భర్తలు తమ భార్యలకు భరణం చెల్లించడం సర్వసాధారణమే అయినా ఈ తీర్పు మాత్రం సంచలనంగా ఉందంటూ ఒక మహిళ తన భర్తకు భరణం చెల్లించాలని ఆదేశించిన అరుదైన సందర్భం అని అంటున్నారు. పైగా చదువుకు సంబంధించి తప్పుడు పత్రాలు కోర్టుకు సమర్పించటం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిదంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)