14 ఏళ్లుగా రాత్రి భోజనం చేయడం లేదు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 11 May 2023

14 ఏళ్లుగా రాత్రి భోజనం చేయడం లేదు !


బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ అందరికీ సుపరిచితుడే. తన విలక్షన నటనతో ఎందరో అభిమానులను సంపాదించాడు. మనోజ్ బాజ్‌పాయ్ టాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించారు. సుమంత్ హీరోగా తెరకెక్కిన 'ప్రేమకథ', బన్నీ హీరోగా నటించిన ‘హ్యాపీ’ మువీల్లో తనదైన నటనతో మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం గురించి పలు ఆసక్తికరల విషయాలు పంచుకున్నారు. "గత 13-14 సంవత్సరాలుగా మా తాతగారి డైట్‌ ఫాలో అవుతున్నాను. నేను రాత్రి భోజనం పూర్తిగా మానేశాను. అందుకే 54 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నాను. మొదట్లో రోజులో 12-14 గంటల ఉపవాసం ఉండేవాన్ని. ఆకలిగా అనిపించినప్పుడు 2 బిస్కెట్లు తిని, ఎక్కువ నీళ్లు తాగేవాడ్ని. వారంపాటు చాలా కష్టంగా అనిపించింది. క్రమంగా రాత్రి భోజనం చేయడం మానేశాను. ఇప్పుడు లంచ్ తర్వాత, మా వంటగది పూర్తిగా బంద్‌ అవుతుంది. నా కూతురు హాస్టల్ నుంచి తిరిగి వచ్చినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. డాక్టర్‌ కూడా ఉదయం బ్నేక్‌ ఫాస్ట్‌ మానేయడం కన్నా రాత్రి డిన్నర్‌ మానేయడం మంచిదని సలహా ఇచ్చారు. లేకుంటే తిన్న ఆహారం పొట్టలోనే మిగిలిపోతుందన్నారు. ఈరోజుల్లో చాలా మంది ఉపవాసం చేస్తున్నారు. కానీ నేను చాలా సంవత్సరాలుగా దీన్ని అనుసరిస్తున్నాను. ప్రతి రోజూ దాదాపు 18 గంటలపాటు ఉపవాసం ఉంటాను. ఆరోగ్యకరమైన ఆహారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య మాత్రమే తింటాను. ఇలా చేయడం వల్ల బరువు అదుపులో ఉండటంతోపాటు ఎనర్జీతో ఉండగలుగుతున్నాను" అని మనోజ్ బాజ్‌పాయ్ చెప్పుకొచ్చారు. 

No comments:

Post a Comment