బాంబు విసిరి ఐదుగురు జవాన్లను బలితీసుకున్న ఉగ్రవాదులు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 5 May 2023

బాంబు విసిరి ఐదుగురు జవాన్లను బలితీసుకున్న ఉగ్రవాదులు


జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ కాండి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ జరుగుతుండగా భద్రతా బలగాలపై బాంబు విసిరారు. ఈ పేలుడులో ఐదుగురు భారత జవాన్లు అమరులయ్యారు. జమ్మూకశ్మీర్‌లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రమూకలు ఇటీవలే పూంచ్‌ ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్‌ యూనిట్‌ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై మెరుపుదాడి చేసి ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నాయి. శ్రీనగర్‌లో జరగనున్న జీ-20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాన్ని వ్యతిరేకించిన లష్కరే తాయిబా అనుబంధ సంస్థ పీపుల్స్‌ యాంటీ-ఫాసిస్ట్‌ ఫ్రంట్‌ ఈ దాడి జరిపింది. ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. 2019లో అల్‌ ఖాయిదా ప్రేరణతో పురుడుపోసుకున్న ఈ ఉగ్రసంస్థ.. జైషే మహమ్మద్‌కు అనుబంధంగా పనిచేస్తోంది. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తూ రిక్రూట్‌మెంట్లకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో పీపుల్స్‌ యాంటీ-ఫాసిస్ట్‌ ఫ్రంట్‌ పాత్ర ఉండడం, దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసాలకు కుట్రలు పన్నడంతో కేంద్ర హోంశాఖ ఈ ఏడాది జనవరిలో ఈ సంస్థపై నిషేధం విధించింది.

No comments:

Post a Comment