ఆన్‌లైన్‌లో సరికొత్త మోసం !

Telugu Lo Computer
0


బెంగళూరులోని ఓ టెక్కీ అద్దెకు ఇంటి కోసం వెతుకుతూ సైబర్ క్రిమినల్స్ చేతిలో ఏకంగా రూ.1.6 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో ఇప్పుడు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు. కోల్‌కతాకు చెందిన 25 ఏళ్ల టెక్కీ ఇటీవల ప్రముఖ ఐటీ సంస్థలో అధిక వేతనంతో ఉద్యోగంలో చేరాడు. జూన్ 1 న నగరానికి వెళ్లి తన కొత్త జాబ్ లో చేరాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ ఉండేందుకు ఓ ఇల్లును అద్దెకు తీసుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో ఇంటి కోసం వేటను ప్రారంభించాడు. ఓ రియల్ ఎస్టేట్ పోర్టల్ నోబ్రోకర్‌లో ఆకర్షణీయమైన ఆఫర్ చూశాడు. నెల రెంట్ రూ.25 వేలుగా చెల్లించాలని, రెండు నెలల అద్దెను అడ్వాన్స్‌గా చెల్లించాలని అందులో ఉంది. దీంతో అందులో ఉన్న కాంటక్ట్ నెంబర్ కు ఫోన్ చేశాడు. అయితే ఓనర్ తనను తాను .. ముంబయిలో ఉద్యోగం చేస్తున్న ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నాడని బాధితుడు చెప్పాడు. ఆ తర్వాత సదరు ఆర్మీ ఆఫీసర్,  ఫ్లాట్‌ మేనేజర్ అని చెప్పి మరో వ్యక్తితో కాంటాక్ట్ అవ్వమని చెప్పాడట. ఈ డీల్ సీల్ చేసుకోవడానికి తొలుత రూ.4 వేలు డిపాజిట్ చేయాలని కోరాడని బాధితుడు వెల్లడించాడు. దీంతో అతను గూగుల్ పేలో తొలుత రూ.4 వేలు పేమెంట్ చేశాడు. అయితే అది గవర్న్‌మెంట్ గ్రాంటెడ్ ప్రాపర్టీ అని, అక్కడికి రావడానికి విజిటింగ్ పాస్ ఉండాలని చెప్పి మరికొంత మొత్తం కట్టాలని అది రీఫండ్ అవుతుందని అతడిని నమ్మించారు. ఇక ఆ పోర్టల్‌పై ఉన్న నమ్మకంతో వారడిగిన మొత్తాన్ని బాధితుడు చెల్లించాడు. మొత్తంగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లతో 8 ఇన్‌స్టాల్‌మెంట్లలో రూ.1.6 లక్షలు పంపిచినట్టుగా బాధితుడు వాపోయాడు. ఆ ఫ్లాట్ అడ్వర్టైజ్‌మెంట్‌ను తీసేసిన నోబ్రోకర్ కస్టమర్‌ను నింధించింది. ఇంటి ఓనర్‌ను కలవకుండా ప్రాపర్టీని నేరుగా చూడకుండా అన్ని సార్లు డబ్బులు ఎలా కట్టారంటూ ప్రశ్నించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)