బస్సు నదిలో పడి 15 మంది మృతి

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ లో ఓ బస్సు ప్రమాదవశాత్తు నదిలో పడి పోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. శ్రీఖండి నుంచి ఇండోర్ కు వెళ్తోన్న బస్సు ఖార్గోన్ జిల్లాలో బ్రిడ్జీపై నుంచి నదిలో పడిపోయింది. బస్సు అదుపుతప్పి నదిపై ఉన్న బ్రిడ్జీ రెయిలింగ్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. స్థానికులు ఘటనాస్థలంలో వద్దసహాయక చర్యలు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)