44 మందికి ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్ లోని హల్ద్‌వాని జైల్లో 1629 మంది పురుష ఖైదీలు, 70 మంది మహిళ ఖైదీలు ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో జైల్లోని పలువురు ఖైదీలు వరుసగా అనారోగ్యం బారినపడుతున్నారు. దీంతో అధికారులు పలువురికి టెస్టులు చేయించగా హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధారణ అయింది. జైల్లో మరికొంత మంది ఖైదీలకు హెచ్ఐవీ ఉండొచ్చన్న అనుమానంతో అందరికీ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వైద్యుల ఆధ్వర్యంలో జైల్లోనే ఏఆర్టీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఖైదీలందరికీ ఆ కేంద్రంలోనే పరీక్షలు నిర్వహించగా, వారిలో మొత్తం 44 మందికి హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం. హెచ్ఐవీ బారినపడిన బాధితులంతా డ్రగ్స్ బానిసలేనని జైలు అధికారులు తెలిపారు. జైల్లో ప్రస్తుతం క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఖైదీలకు చికిత్స చేయిస్తున్నట్లు వారు చెప్పారు. కేవలం ఒక జైల్లో 44 మందికి హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)