ప్రపంచ నేతల్లో అత్యంత ప్రియమైన వ్యక్తి మోడీ !

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్ర మోడీపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన నేత మోడీ అని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజామోదం పొందిన నరేంద్ర మోడీ.. ప్రపంచ నేతల్లోనే అత్యంత ప్రియమైన వ్యక్తి అని మెలోని వ్యాఖ్యానించారు. డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి, ఇతర బృందంతో కలిసి ఇటలీ ప్రధాని భారతదేశానికి వచ్చారు. మోడీతో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే మోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోనే మోడీ కీలక నేత అని నిరూపణ అయ్యిందని, అందుకు ఆయనకు అభినందనలు తెలిపారు.  మోడీ, మెలోనీ భేటీలో ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపైనా కీలకంగా చర్చించారు. ఉక్రెయిన్ దేశంలో పూర్తిస్థాయిలో ప్రశాంత వాతావరణం ఏర్పడేందుకు ఇరు దేశాలు కృషి చేస్తాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. భారత దేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి.. ఇటలీతో ద్వైపాక్షిక చర్చలపై స్పందించారు. రాజకీయ, వాణిజ్యం, ఆర్థిక, రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంధనం, ఆరోగ్యం, కాన్సులర్, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన విస్తారమైన ఎజెండా వేచి ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో, ప్రధాని మోడీ, ఇటలీ ప్రధాని మెలోనీ మధ్య చర్చలు జరుగుతున్నాయని మిస్టర్ బాగ్చీ చెప్పారు. "వృద్ధిని పెంపొందించడానికి, వివిధ రంగాలలో సహకారాన్ని విస్తృతం చేయడానికి. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై లోతైన కలయికకు పరస్పర నిబద్ధతతో బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంపై నాయకులు అభిప్రాయాలను మార్పిడి చేసుకుంటారు' అని బాగ్చి చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)