రెండు ప్రత్యేక సందర్భాలలో టోల్ చార్జీ కట్టనవసరం లేదు !

Telugu Lo Computer
0


ప్రభుత్వం ప్రజల రవాణా సౌకర్యార్థం ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్తగా నిర్మించిన లేదా నిర్మించబోయే జాతీయ రహదారులపై ఎన్‌హెచ్ఏఐ టోల్ టాక్స్ వేస్తారన్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతి ఇలా కొందరు ప్రముఖులు మినహా ప్రతి ఒక్కరు టోల్ ట్యాక్స్ కట్టి తీరాల్సిందే. అయితే ఈ రోడ్లపై టోల్ ట్యాక్స్ కట్టడానికి మనకు కూడా మినహాయింపు ఉంటుంది. కానీ అదెప్పుడు పడితే అప్పుడు కాదు. కేవలం రెండు ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఆ మినహాయింపు ఉంటుంది. టోల్ గేట్ నుంచి 100 మీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్ అయితే మనం టోల్ కట్టకుండానే గేట్ దాటి వెళ్లవచ్చు. టోల్ గేట్‌కు కొద్ది దూరంలో ఒక పసుపు రంగు లైన్ ఉంటుంది. ఆ లైన్‌కు అవతల ఎవరైనా 10 లేదా అంతకన్నా ఎక్కువ సెకన్ల పాటు వేచి ఉన్నట్టయితే వారు కూడా టోల్ కట్టాల్సిన పనిలేదు. నేరుగా గేట్ నుంచి వెళ్లిపోవచ్చు. ఇవి స్వయంగా నేషనల్ హైవేస్ ఆథారిటీ ఆప్ ఇండియా జారీ చేసిన రూల్స్. 


Post a Comment

0Comments

Post a Comment (0)