వంకాయ - ఆరోగ్య సమస్యలు

Telugu Lo Computer
0


వంకాయలో రకాలు ఉంటాయి. నాటు వంకాయలు, హైబ్రిడ్ వంకాయలు ఉంటాయి. వీటిల్లోనూ ఊదా రంగుతో పాటు ఆకుపచ్చ, తెలుపు రంగుల్లోనూ వంకాయలు ఉంటాయి. ఎంతో రుచికరమైన ఈ వంకాయలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అయితే, అదే సమయంలో కొందరికి వంకాయ ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు వంకాయను తినడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు.  కిడ్నీ స్టోన్ ఉన్నవారు వంకాయ తినకూడదు. కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడేవారు వంకాయ తినడం వల్ల.. అందులోని గింజలు కిడ్నీలో రాళ్లు తయారయ్యేందుకు కారణం అవుతాయి. తద్వారా కిడ్నీ దెబ్బ తింటుంది. వంకాయలో ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది. దీని కారణంగా కాల్షియం శోషణ తగ్గుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిగణించబడుతుంది. ఎముకలు బలహీనంగా ఉన్న వ్యక్తులు బెండకాయ తినకుడదు. పైల్స్ బాధితులు కూడా వంకాయకు దూరంగా ఉండటం ఉత్తమం. రక్తహీనత, పైల్స్ సమస్యతో బాధపడేవారు వంకాయ తినొద్దు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు వంకాయ తినకూడదు. దీని వల్ల కీళ్లనొప్పుల సమస్య మరింత తీవ్రమవుతుంది. వంకాయలు ఎక్కువగా తినడం కూడా హానికరం. దీని కారణంగా.. కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి, దురద వంటి సమస్యలు వస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)