తమ్మినేనిపై వేటు పడుతుందా ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఫేక్ లా సర్టిఫికేట్ వివాదం రాజకీయంగా కలకలం రేపుతోంది. అదికూడా స్పీకర్ తమ్మినేని సీతారాంకు అల్లుడైన.. ప్రత్యర్థి పార్టీ నేత కూన రవి కుమార్ దీనిపై జాతీయ స్థాయి పోరాటానికి సిద్ధమయ్యారు. ఇఫ్పటికే స్పీకర్ ఫేక్ సర్టిఫికేట్ అంశంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. తమ్మినేని సీతారాం, కూన రవి కుమార్ వరుసకు మామా అళ్లుల్లు ఇద్దరూ ఒకప్పుడు జిల్లాలో ఆదిపత్యం చెలాయించే వారు. ఇప్పుడు పార్టీలు వేరు అవ్వడంతో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. మామను సరైన దెబ్బకొట్టాలని ఎదురుచూస్తున్న రవికుమార్ కు  సీతారాం ఢిగ్రీ లేకుండా న్యాయపట్టా పొందారనే విషయం తెలియడంతో దీనిపై జాతీయ స్థాయిలో ఫిర్యాదులు చేశారు. తమ్మినేనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా ఎల్ఎల్ బీ కోర్స్ చేయాలి అంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. కానీ గత ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో డిగ్రీ పూర్తి కాలేదని ఉంది. అంతేకాదు గతంలో కొన్ని ఇంట్వర్వ్యూలలో సైతం డిగ్రీ పూర్తి కాలేదని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి , కోటబోమ్మాళిలలో ప్రాధమిక విధ్యను , శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ విధ్యను అభ్యసించినట్లు , డిగ్రీ డిస్ కంటిన్యూ చేసినట్లు స్పీకర్ పలు టీవీ ఇంటర్వూలతో పాటు, ఎన్నికల అఫిడవిట్ లో కూడా పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇంటర్ తరువాత లా చేయాలి అనుకుంటే ఐదేళ్ల కోర్సులో జాయిన్ అవ్వాలి. మరి డిగ్రీ పూర్తి కాకాకుండా మూడేళ్ల ఎల్ ఎల్ బీ కోర్సు కోసం ఎలా అడ్మిషన్ తీసుకున్నారన్నదానిపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం ఒక నెల వ్యవధిలో ఏవిధంగా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఎల్ఎల్ బీ జాయిన్ అయ్యారా.. లేక చేతిలో ఉన్న అధికారాని దుర్వినియోగం చేశారా? యూనివర్శి అధికారులను మభ్య పెట్టో.. బెదిరించో లా కాలేజ్ లో జాయిన్ అయ్యారన్నది టీడీపీ నేతల వాదన.. గౌరవనీయమైన.. అత్యంత బాధ్యతాయుతమైన స్పీకర్ పదవిలో ఉన్న తమ్మినేని సీతారామం ఇలా.. వ్యవస్థలను మోసం చేయడం.. ఫేక్ లా డిగ్రీ సర్టిఫికేట్ పొందడం పై చర్యలు తీసుకోవాలని.. కోరుతూ కూన రవి రాష్ట్రపతికే ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేది లేదు అంటున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాల ద్వారా కూడా న్యాయం కోరుతామంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)