మమతా, అఖిలేష్ కొత్త ఫ్రంట్ !

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ చీఫ్ మమతా బెనర్జీని కోల్‌కతాలో కలిశారు. ఇరువురు నేతల భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేకుండా కొత్త రాజకీయ పక్షాన్ని ఏర్పాటు చేసేందుకు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ అంగీకరించారు. మరోవైపు వచ్చే వారం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ పార్టీ చీఫ్ నవీన్ పట్నాయక్ ను కలవనున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ప్రతిపక్ష కూటమికి కీలక నేతగా చూపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఈ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బెంగాల్ లో మేము దీదీ వెంటే ఉన్నాము, ప్రస్తుతం మా స్టాండ్ బీజేపీకి, కాంగ్రెస్ కు సమాన దూరాన్ని పాటించడమే అని, బీజేపీకి అనుకూలంగా ఉండే వారికి సీబీఐ, ఈడీ, ఐటీ నుిచి ఏం కాదని అన్నారు. బీజేపీలో చేరిన తర్వాత దర్యాప్తు సంస్థలు కేసులు ఎత్తేస్తున్నాయని అఖిలేష్ యాదవ్ అన్నారు. రాహుల్ గాంధీ ఇటీవల యూకే పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని, రాహుల్ గాంధీని ఉపయోగించుకుని సభను నడపాలని అధికార బీజేపీ కోరుకోవడం లేదని, రాహుల్ గాంధీనే 2024 ఎన్నికల్లో విపక్షాలకు ప్రధాని అభ్యర్థిగా ఉండాలని బీజేపీ కోరుకుంటోందని, ప్రధాని ఎవరన్నది నిర్ణయించాల్సిన అవసరం లేదని త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అన్నారు. విపక్షాలకు కాంగ్రెస్ బిగ్ బాస్ అని అనుకోవడం అపోహే అని ఆయన అన్నారు. మార్చి 23న మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ భేటీ అవుతారని, కాంగ్రెస్, బీజేపీకి దూరంగా ఉంటే కొత్త ఫ్రంట్ గురించి ఆలోచిస్తామని, అయితే దీన్ని థర్డ్ ఫ్రంట్ గా చెప్పడం లేదని, ప్రాంతీయ పార్టీల బలాన్ని బీజేపీకి వ్యతిరేకంగా కూడగట్టే ప్రయత్నం అని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)