జీడిపప్పు - అనర్ధాలు !

Telugu Lo Computer
0

ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఆహారం విషయంలో నియమాలు పాటించకపోతే అనారోగ్య సమస్యలు రావడమే కాకుండా, ప్రస్తుతం ఉన్న అనారోగ్య సమస్యలు కూడా మరింత తీవ్రమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం ఏం తినాలి? ఏం తినకూడదు? అనేది అర్థం చేసుకోకపోతే మధుమేహం, కిడ్నీ వ్యాధులు, రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. చాలామంది శరీరానికి సరైన పోషకాలు కావాలని డ్రైఫ్రూట్స్ ను ఎక్కువ తింటూ ఉంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా కొన్ని వ్యాధులు ఉన్నవారు జీడిపప్పును అసలే తినకూడదని చెబుతున్నారు. ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే హై బీపీ, గుండె జబ్బులు, మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి మనల్ని మరింత ప్రమాదానికి గురిచేసే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అటువంటి వాటిల్లో జీడిపప్పు ముఖ్యమైనది. జీడిపప్పును ఎనర్జీ పవర్ హౌస్ అంటారు. జీడిపప్పులో పెద్ద మొత్తంలో ప్రోటీన్లు, విటమిన్లు, క్యాల్షియం, ఐరన్ ఉంటాయి. నిజంగా ఆరోగ్యవంతుల ఇవి శరీరానికి మేలే చేస్తాయి. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రం జీడిపప్పు విషం తో సమానం. ఒకవేళ జీడిపప్పును తిన్నా ఎంత మేరకు తినాలి అనేది కూడా తెలిసి ఉండాలి. ఫైబర్ అధికంగా ఉండే జీడిపప్పును ప్రతిరోజు తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు బలం చేకూరుతుంది. ప్రతిరోజు నాలుగు నుండి ఐదు జీడిపప్పులను మాత్రమే తినడం ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అంతకంటే ఎక్కువ తింటే డేంజర్ అని గుర్తించాలి. జీడిపప్పులో ఉండే ట్రై గ్లిజరైడ్స్ వల్ల ఇది గుండె జబ్బులు ఉన్నవారికి విషంలా పనిచేస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు జీడిపప్పును తినకుండా ఉండటమే మంచిదని సూచించబడింది. అధిక బరువుతో ఉన్నవారు జీడిపప్పును తినటం మానుకోవాలని చెప్పబడింది. జీడిపప్పులో 18 గ్రాముల ప్రోటీన్, 553 క్యాలరీలు ఉంటాయి. ఇవి వేగంగా బరువు పెరగడానికి కారణం అవుతాయి. అంతేకాదు జీడిపప్పులో విషపూరితమైన యూరియోషియోల్ ఉంటుంది. ఇది శరీరంలో టాక్సిన్స్ ను బాగా పెంచుతుంది. కాబట్టి జీడిపప్పును గుండె జబ్బులు ఉన్నవారు, అధిక బరువుతో బాధపడేవారు తినకుండా ఉండడం మంచిదని నిపుణులు అంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)