దేశంలో తాజాగా 1,071 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,071కి పైగా తాజా కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 76 నమూనాల్లో XBB 1.16 వేరియంట్‌ను వైద్యులు గుర్తించారు. దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణంగా భావిస్తున్నారు. అయితే XBB 1.16 వేరియంట్‌ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. వైరస్ సోకితే అలసట,దగ్గు,తలనొప్పి, గొంతులో మంట ఏర్పడతాయని వెల్లడించారు. ఇన్‌ఫ్లుఎంజా, కోవిడ్ మధ్య వ్యత్యాసం పరీక్ష తర్వాత మాత్రమే కనిపెట్టగలమని వైద్యులు తెలిపారు. అయితే H3N2 వైరస్ సోకిన వ్యక్తులు అధిక జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలతో ఇబ్బందులు పడతాయన్నారు. అటు కోవిడ్‌తో బాధపడుతున్న వ్యక్తులు గొంతు నొప్పి, దగ్గు,జలుబు వంటి లక్షణాలు కలిగి ఉంటారని తెలిపారు. ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్‌ కేసులో కర్ణాటకలో 30, మహారాష్ట్రలో 29, పుదుచ్చేరిలో 7, ఢిల్లీలో 5, తెలంగాణలో 2, గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్‌, ఒడిశాలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. XBB 1.16 వేరియంట్ తొలిసారిగా జనవరిలో గుర్తించారు. ఫిబ్రవరిలో 59 నమూనాల్లో ఈ వేరియంట్‌ను కనుగొన్నారు. మార్చిలో ఇప్పటి వరకు XBB 1.16 వేరియంట్‌ 15 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదలకు ఈ వేరియంట్ కారణమని నిపుణులు భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)