భార్య గొంతు నులిమి చంపి లొంగిపోయిన భర్త

Telugu Lo Computer
0


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లిలో శ్రీకాంత్ తన భార్య సరిత గొంతు నులిమి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం శ్రీకాంత్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏడు సంవత్సరాల క్రితం దంపతులకు పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానంతో హత్య చేశారా? లేక ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో ఆవేశంలో చంపేశారా? అనేది తెలియాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)