ఇందిరా గాంధీ నా తం‍డ్రిని పదవి నుంచి తొలగించారు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 22 February 2023

ఇందిరా గాంధీ నా తం‍డ్రిని పదవి నుంచి తొలగించారు !


తాను ప్రభుత్వాధికారుల కుటుంబానికి చెందినవాడినని అన్నారు. తనకు 2019లో కేంద్రమంత్రిగా రాజకీయ అవకాశం వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా తన తండ్రి గురించి ప్రస్తావిస్తూ తన తండ్రి డాక్టర్‌ కె సుబ్రమణియన్‌ డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ సెక్రటరీగా పనిచేశారని, 1980లో ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన్ని తొలగించారని చెప్పారు. ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ సమయంలో తన తండ్రి కంటే జూనియర్‌ క్యాబినేట్‌ సెక్రటరీ అ‍య్యారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాధికారిగా ఉన్న తన తండ్రి సుబ్రమణ్యం 1979 జనతా ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన డిఫెన్స్‌ ప్రొడెక్షన్‌ సెక్రటరీ. అయితే ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగింపబడ్డ తొలి వ్యక్తి నా తండ్రే. అందువల్లే తన అన్నయ్య సెక్రటరీ అవ్వడంతో తన తండ్రి ఎంతగానో సంతోషించాడున్నారు. బహుశా అందువల్లే కాబోలు తాను కూడా మంచి అధికారిగానే కాకుండా విదేశాంగ కార్యదర్శి పదవికి ఎదగాలని కోరుకున్నా. కానీ తాను తన తండ్రి మరణించాకే విదేశాంగ కార్యదర్శిని అయ్యానన్నారు. 2019లో నరేంద్ర మోదీ నేతృత్వంలో క్యాబినేట్‌లో భాగం కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ప్రధాని చేసిన ఫోన్‌కాల్‌ తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఆ తర్వాత తాను కేంద్ర మంత్రి వర్గంలో చేరినట్లు చెప్పారు. అయితే విదేశాంగ కార్యదర్శిగా జీవితాంతం ఎందరో రాజకీయ నాయకులను చూశానన్నారు.కానీ తాను పార్లమెంట్‌ సభ్యుడిని కాకపోవడంతో రాజకీయాల్లోకి చేరడం, రాజసభ సభ్యుడు కావడం, అన్ని ఒక్కొక్కటిగా తనకు తెలియకుండానే సాగిపోయాయని చెప్పుకొచ్చారు. ఒక ప్రభుత్వాధికారితో పోలిస్తే కేంద్ర మంత్రి ఎక్స్‌పోజర్‌ వేరే స్థాయిలో ఉంటుందన్నారు జైశంకర్‌. ఫారెన్‌ సర్వీస్‌ అధికారిగా, మంత్రిగా విభిన్న ప్రపంచ ఉండటమే గాక ఒక సవాలుగా కూడా ఉంటుందన్నారు. ఐతే బ్యూరోక్రాట్‌ కంటే మంత్రి వేగంగా ఆలోచించగలడని అన్నారు. ‍ప్రతి సమస్య వెనుకు ఒక రాజకీయ కోణం దాగి ఉంటుందని, అది ఒక చాలెంజింగ్‌గా ఉంటుందన్నారు మంత్రి జై శంకర్‌. కాగా, 2015 నుంచి 2018 వరకు జై శంకర్‌ విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు.

No comments:

Post a Comment