హిజ్రాలకు క్షమాపణలు చెప్పిన వైఎస్ షర్మిల - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 22 February 2023

హిజ్రాలకు క్షమాపణలు చెప్పిన వైఎస్ షర్మిల


ఈనెల 18న మహబూబాబాద్‌లో జరిగిన పాదయాత్రలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను 'హిజ్రా' తో పోల్చారు. దీంతో షర్మిల ట్రాన్స్‌జెండర్లను అవమానించారంటూ వారంతా నిరసనకు దిగడంతో వారికి క్షమాపణలు చెప్పారు. ట్రాన్స్‌జెండర్ల పట్ల తనకు, తన పార్టీకి ఎనలేని గౌరవం ఉందని, క్షణికావేశంలో ఆ మాట అన్నానని, అయితే వారిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, వారిపై తనకెప్పుడూ గౌరవమేనని షర్మిల స్పష్టం చేశారు. మేము మిమ్మల్ని గౌరవిస్తామని, మా సమాజంలో మీకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఎవరైనా తమను బాధపెట్టినట్లు భావిస్తే క్షమాపణలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వల్ల ట్రాన్స్‌జెండర్లకు ఒరిగిందేమీ లేదని, వైఎస్‌ఆర్‌టీపీ అధికారంలోకి వస్తే వారి అభ్యున్నతికి పాటుపడుతుందని, అలాగే సంక్షేమ పథకాలు, రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. తమను అవమానించినందుకు షర్మిల క్షమాపణ చెప్పాలంటూ ట్రాన్స్‌జెండర్లు మంగళవారం హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్రంలో ఆమె పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యేను హిజ్రా అని విమర్శించడంతో అధికార పార్టీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. షర్మిలపై కేసు నమోదుచేసి పోలీసులు తమ అదుపులోకి తీసుకొని బలవంతంగా హైదరాబాద్ కు తరలించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాత్రమే తాను స్పందించానని, శంకర్ నాయక్ తనను హిజ్రా అని పిలిచాడని, తాను కేవలం 'ఎవరు హిజ్రా' అని సమాధానమిచ్చానన్నారు.

No comments:

Post a Comment