ఎన్నికల సంఘం మోడీకి బానిస

Telugu Lo Computer
0


శివసేనపై హక్కుల్ని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేకు కట్టబెడుతూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు, ఆ వెంటనే పార్టీ గుర్తుతో పాటు పేరును మారుస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ఇవాళ నిప్పులు చెరిగారు. ఈసీ నిర్ణయం వెనుక ప్రధాని మోడీ ఉన్నారని ఆరోపిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు, ఈసీ నిర్ణయాల నేపథ్యంలో తన నివాసం మాతోశ్రీ వద్ద భారీగా చేరుకున్న అనుచరులతో మాట్లాడిన ఉద్ధవ్ థాక్రే.. ఈసీ ప్రధాని మోడీ చేతిలో బానిసగా మారిందని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్ధితి లేదన్నారు. తన అనుచరులంతా శాంతియుతంగా ఉండాలని, ముంబై కార్పోరేషన్ బీఎంసీకి వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తన తండ్రి బాల్ థాక్రేను గుర్తుచేసేలా తన కారు సన్ రూఫ్ లో నుంచి నిలబడి ఉద్ధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ చిహ్నం దొంగతనానికి గురైందని, దొంగకు తగిన గుణపాఠం చెప్పాలంటూ ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండేను ఉద్దేశించి ఉద్ధవ్ థాక్రే విమర్శలు గుప్పించారు. శివసేన పార్టీ నియంత్రణపై జరిగిన సుదీర్ఘ పోరాటంపై 78 పేజీల ఉత్తర్వులో 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచిన 76 శాతం ఓట్లతో షిండేకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం గత ఏడాది కేటాయించిన 'శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే' పేరును, 'జ్వలించే టార్చ్' చిహ్నాన్ని అలాగే ఉంచుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)