ఏటీఎం కేంద్రాల్లో భారీ చోరీ !

Telugu Lo Computer
0


తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని 4 ఏటీఎం సెంటర్లలో ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి దొంగలు చొరబడి రూ. 72,50, 000 రూపాయలు దోచుకుని దర్జాగా వెళ్లిపోయారు. విషయం తెలుుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఏటీఎం కేంద్రాల్లో నగదు లూటీ అయ్యిందని తెలుసుకున్న సంబంధిత బ్యాంకు అధికారులతో పాటు స్థానిక ప్రజలు హడలిపోయారు. నిందితులు ఏటీఎం కేంద్రాల దగ్గరకు వాహనంలో వచ్చిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి, దోపిడీకి ముందు దుండగులు ఏటీఎం యంత్రాలను ధ్వంసం చేశారు. ఏటీఎం కేంద్రాలను నిందితులు లక్ష్యంగా చేసుకున్న దృశ్యాలు కూడా పోలీసులకు చిక్కాయి. ఏటీఎం యంత్రాల్లో దోపిడీకి ఆరుగురుతో కూడిన ముఠా పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఏటీఎం టెక్నాలజీ గురించి పూర్తిగా తెలిసిన ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తిరుణ్ణామలైలో ఏటీఎం యంత్రాల్లో రూ. 75 లక్షలు లూటీ చేసిన ముఠా సభ్యులు అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి వెళ్లి అక్కడ ఒక్కరోజు ఉన్నారు. తరువాత చిత్తూరు, పలమనేరు మీదుగా కర్ణాటకలోని కోలారు జిల్లాలోని కేజీఎఫ్ తో నిందితులు తలదాచుకున్నారని తమిళనాడు పోలీసులు గుర్తించారు. తిరువణ్ణామలై జిల్లా పోలీసులు ప్రత్యేక బలగాలతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో నిందితుల కోసం గాలించారు. కొందరు పోలీసులు కోలారు జిల్లాలోని కేజీఎఫ్ చేరుకుని నేరగాళ్లకు ఆశ్రయం కల్పించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తిరువణ్ణామలై ఏటీఎం కేంద్రాల్లో దోపిడీకి పాల్పడిన హర్యానాలోని మేవాత్‌కు చెందిన ఆసిఫ్, ఆజాద్‌లను తమిళనాడు స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నిందితులను భారీ బందోబస్తుతో తిరువణ్ణామలై తీసుకెళ్లారు. ఈ ముఠాలోని మిగిలిన సభ్యుల కోసం గాలిస్తున్నామని తిరువణ్ణామలై జిల్లా ఎస్పీ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)