అజ్నాలా హింసాకాండ విదేశీ శక్తుల పని ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 27 February 2023

అజ్నాలా హింసాకాండ విదేశీ శక్తుల పని !


అజ్నాలాలోని పోలీస్ స్టేషన్ పై దాడిపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మాట్లాడుతూ కేవలం వెయ్యి మంది పంజాబ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించరని అన్నారు. రాష్ట్రంలో శాంతికి భంగం కలిగించే ప్రయత్నంలో పాకిస్తాన్ వారికి నిధులు సమకూర్చిందని ఆరోపించారు. విదేశీ శక్తులు, ముఖ్యంగా పాకిస్తాన్ నిధులు సాయంతో ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని అన్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ పోలీసుల నుంచి నివేదిక కోరింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అజ్నాలా ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రమైందని, పంజాబ్ లో శాంతి భద్రతలు కుప్పకూలాయిని అన్నారు. హింసకు పాల్పడిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ అన్నారు. అజ్నాలా సంఘటనలో మొత్తం ఐదుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి. ఎస్పీ కూడా గాయపడ్డారు. పోలీసుల వాంగ్మూాలాన్ని రికార్డ్ చేసుకుని చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసులపై దాడిని పిరికిపంద చర్యగా డీజీపీ అభివర్ణించారు. పోలీసులు గురుగ్రంథ సాహిబ్ పవిత్రతను పరిగణనలోకి తీసుకుని అత్యంత సంయమనంతో పని చేశారని అన్నారు. 

No comments:

Post a Comment