తగ్గిన మొండి బకాయిలు

Telugu Lo Computer
0


బ్యాంకులకు మొండి బకాయిలు భారీగా తగ్గాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు ఏడేళ్ల కనిష్టానికి దిగొచ్చాయని 26వ ఆర్థిక స్థిరత్వ నివేదికలో పేర్కొంది. గ్రాస్‌ నాన్‌ పెర్‌ఫామింగ్‌ అసెట్స్‌ 5%, నెట్‌ ఎన్‌పీఏలు పదేళ్ల కనిష్టానికి కరిగి.. 1.3% చేరాయని వెల్లడించింది. సెప్టెంబర్‌ వరకు అందుబాటులో ఉన్న ఈ వివరాలను విడుదల చేసిన రిపోర్ట్‌లో పొందుపరిచింది. దేశంలోని బ్యాంకుల్లో మూలధన నిల్వలు తగినంతగా ఉన్నాయని, ఆర్థిక మాంద్యం లాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా తట్టుకోగలవని ధీమా వ్యక్తం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)