లాలూకు కిడ్నీ దానం చేసేందుకు రోహిణి అంగీకారం

Telugu Lo Computer
0


ఆర్జేడీ అధినేత లాలా ప్రసాద్ యాదవ్‌ కుమార్తె తన తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు సిద్ధపడింది. లాలూ ప్రసాద్ యాదవ్ చాలా కాలం నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కొంతకాలం క్రితం జైలు నుంచి విడుదలైన ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్‌లో ఉంటున్న లాలూ రెండో కుమార్తె రోహిణి తన తండ్రి అనారోగ్యం గురించి తీవ్రంగా కలత చెందారు. ఆయనకు కిడ్నీ మార్పిడి చేస్తే మెరుగైన జీవితం గడిపి, ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుసుకున్నారు. ఇటీవలే లాలూను తనతోపాటు సింగపూర్ తీసుకెళ్లిన ఆమె అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించింది. తన తండ్రికి కిడ్నీ ఇస్తే ఆయన కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో దీని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. తన తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు అంగీకరించింది. కిడ్నీ సంబంధిత సమస్యల్తో బాధపడుతున్న వారికి రక్త సంబంధీకులు ఎవరైనా కిడ్నీ దానం చేయొచ్చనే సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయాన్ని లాలూ వ్యతిరేకించారు. తన కూతురు కిడ్నీ తీసుకోవడానికి అంగీకరించలేదు. కానీ, వైద్యుల సూచన మేరకు అంగీకరించారు. రక్త సంబంధీకులు చేసే అవయవదానం మరింత సత్ఫలితాన్నిస్తుందని నమ్మడం వల్ల కూడా లాలూ దీనికి అంగీకరించారు. ఈ నేపథ్యంలో కిడ్నీ మార్పిడికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే లాలూ సింగపూర్ వెళ్లబోతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)