ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 9 November 2022

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం


టీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12 ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి సెమీస్‌ వరకు చేరుకోగలిగిన కివీస్‌, అసలైన మ్యాచ్‌లో చేతులెత్తేసిన విషయం తెలిసిందే. సిడ్నీ వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో పాక్‌ చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఫైనల్‌ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది గతేడాది రన్నరప్‌గా నిలిచిన బ్లాక్‌ క్యాప్స్‌. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ మాట్లాడుతూ.. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ''వాళ్లు నిజంగా అత్యద్భుతంగా ఆడారు. బాబర్‌, రిజ్వాన్‌ ఈ ఇద్దరూ మమ్మల్ని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేశారు. ఈ మ్యాచ్‌లో మా ఆట అస్సలు బాగాలేదు. ఏదేమైనా ఈ విజయానికి వాళ్లు అర్హులు. టోర్నీ ఆసాంతం బాగా ఆడిన మేము.. కీలక మ్యాచ్‌లో మాత్రం మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేకపోయాం. టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా!'' అని విలియమ్సన్‌ పేర్కొన్నాడు.

No comments:

Post a Comment