డిసెంబర్‌ నుంచి అమలుకానున్న కొత్త నిబంధనలు !

Telugu Lo Computer
0


డిసెంబర్‌లో ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయల్ రూల్స్, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో  మార్పులు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓటీపీ రూల్స్, ఇలా అనేక కొత్త రూల్స్ డిసెంబర్‌లో అమలులోకి రానున్నాయి.  ప్రతీ నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తూ ఉంటాయి. గ్యాస్ సిలిండర్ ధర పెరగొచ్చు. తగ్గొచ్చు. లేదా స్థిరంగా ఉండొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు డెబిట్ కార్డుతో డబ్బులు విత్‌డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి కానుంది. కస్టమర్లు కార్డును ఏటీఎం మెషీన్‌లో పెట్టి, పిన్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన డబ్బులు డ్రా చేయాలి. రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయడానికి ఓటీపీ తప్పనిసరి.  కొత్త టైమ్ టేబుల్ డిసెంబర్ 1నుంచి అమలులోకి రానుంది. 13,000 ప్యాసింజర్ రైళ్లు, 7,000 గూడ్స్ రైళ్లు, 30 రాజధాని రైళ్లకు సంబంధించిన టైమ్ టేబుల్‌లో మార్పులు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో అకౌంట్ ఉన్న కస్టమర్లు డిసెంబర్ 12 లోగా కేవైసీ అప్‌డేట్ చేయాలి. కేవైసీ అప్‌డేట్ చేయకపోతే వారి అకౌంట్‌ను బ్లాక్ చేస్తామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెచ్చరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కస్టమర్లు కేవైసీ అప్‌డేట్ చేయించడం తప్పనిసరి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి డిసెంబర్ 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ సిస్టమ్ సర్వీస్ ఛార్జీలను ప్రకటించింది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. క్యాష్ విత్‌డ్రాయల్ కోసం రూ.20 + జీఎస్‌టీ, క్యాష్ డిపాజిట్ కోసం రూ.20 + జీఎస్‌టీ, మినీ స్టేట్‌మెంట్ కోసం రూ.5+ జీఎస్‌టీ చెల్లించాలి.  హీరో బైక్ లేదా స్కూటర్ కొనాలనుకునేవారు కాస్త ఎక్కువ ఖర్చు చేయక తప్పదు. హీరో మోటోకార్ప్ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరల్ని రూ.1,500 వరకు పెంచింది. పెరిగిన ధరలు డిసెంబర్ 7 నుంచే అమలులోకి రానున్నాయి.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రీటైల్ (e₹-R) పైలట్ ప్రాజెక్ట్‌ను డిసెంబర్ 1న ప్రారంభించనుంది. క్లోజ్డ్ యూజర్ గ్రూప్ అంటే ఎంపిక చేసిన ప్రాంతాల్లో, ఎంపిక చేసిన వ్యాపారులు, కస్టమర్లు మాత్రమే ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ఉంటారు.

Post a Comment

0Comments

Post a Comment (0)