గుజరాత్‌లో గెలుపు మాదే - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 3 November 2022

గుజరాత్‌లో గెలుపు మాదే


గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఈ సారి రాష్ట్రంలో బీజేపీకి భంగపాటు తప్పదన్నారు. అక్కడి ప్రజలు పాలనలో మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ ఒకటో తేదీన తొలి దఫా, అయిదవ తేదీన రెండో దఫా ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎన్నికల తేదీని ప్రకటించిన కొద్దిసేపటికే అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ఈ ఎన్నికల్లో 95 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్‌ అభ్యర్థులు పోటీ చేస్తారని వెల్లడించారు. 'నేను మీ సోదరుడిని, మీ కుటుంబలో సభ్యుడిని. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీకు ఉచిత విద్యుత్‌ అందిస్తా. పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తా..' అని తెలిపారు. గుజరాత్‌ ఎన్నికలపై ఆప్‌ ప్రధాన ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ సైతం స్పందించారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 'మేము తప్పకుండా 90- 95 సీట్లు గెలుస్తాం. ఇదే జోరు కొనసాగితే 140 నుంచి 150 సీట్ల దాకా గెలిచే అవకాశం ఉంది' అని విశ్వాసం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment