దేశంలో 215 కరోనా కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో  తాజాగా 215 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇది గత రెండేళ్లలో ఒక రోజులో నమోదైన కనిష్ఠ కొత్త కేసులు కావడం విశేషం. 2020 ఏప్రిల్‌ తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. Covid-19 | దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 215 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, ఇది గత రెండేళ్లలో ఒక రోజులో నమోదైన కనిష్ఠ కొత్త కేసులు కావడం విశేషం. 2020 ఏప్రిల్‌ తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4,46,72,068కి చేరింది. ఇక ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 4,41,36,471మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,982 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో వైరస్‌ కారణంగా ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,615కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.01శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.80శాతం, మరణాలు 1.19శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 219.91 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)