పావురం బిర్యానీ... ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 29 November 2022

పావురం బిర్యానీ... !


ముంబయి లోని సియోన్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో అభిషేక్‌ సావంత్‌ పావురాలను పెంచి బార్‌, రెస్టారెంట్లలో అమ్ముతున్నాడని 71 ఏళ్ల రిటైర్డ్‌ ఆర్మీ కెప్టెన్‌ హరీశ్‌ గగలాని పోలీసులకు ఈ ఫిర్యాదు చేశారు. ''అభిషేక్‌ అనే వ్యక్తి అపార్ట్‌మెంట్‌పై పావురాలను పెంచుతు తన డ్రైవర్‌ సహాయంతో వాటిని ముంబయిలోని బార్‌, రెస్టారెంట్స్‌కు అమ్ముతున్నాడు. అపార్ట్‌మెంట్‌ సొసైటీ వాచ్‌మేన్‌ ఆ పావురాలకు నీళ్లు పోసేందుకు వెళ్లేవాడు. ఈ విషయాన్ని అపార్ట్‌మెంట్‌ సొసైటీలో తెలిపాడు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. వినేసి వదిలేశారు మనకెందుకులే అని. కానీ దేశానికి సేవ చేసి రిటైర్ అయిన హరీశ్ గగలాని మాత్రం వదల్లేదు. నిఘా వేసి మరీ తానే స్వయంగా అన్ని ఆధారాలు సేకరించాడు. పావురాలను పెంచుతున్న ప్రాంతానికి వెళ్లి ఫోటోలు తీసారు హరీశ్ గగలాని. ఆధారాలు సేకరించాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.పావురాలను పెంచుతున్న ఫోటోలను పోలీసులకు అందజేశారు. ఫిర్యాదులో అభిషేక్ సావంత్ అనే వ్యక్తి పావురాలను పెంచి బార్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నాడని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు అపార్ట్‌మెంట్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీ, సొసైటీలో కొంతమందిపై కేసులు పెట్టారు. హరీశ్‌ చెప్పిన విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment