చేరిన 2 రోజులకే ఉద్యోగం ఔట్ !

Telugu Lo Computer
0


ఆర్థిక మాంద్యం సూచనలు, పెరుగుతున్న వడ్డీ రేట్లుకు టెక్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కూడా భారీగా ఉద్యోగాలకు కోత విధించింది. మెటా నిర్ణయంతో సుమారు 11 వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీనిలో భాగంగానే భారత్‌కు చెందిన హిమాన్షు కూడా నిరుద్యోగిగా మారాడు. ఫేస్‌బుక్‌లో ఉద్యోగం కోసం కెనడా వెళ్లిన హిమాన్షు.. అక్కడ ఉద్యోగంలో చేరిన రెండు రోజులకే జాబ్ కోల్పోయి విపత్కపరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తన తాజా పరిస్థితిపై లింక్డిన్‌లో అతడు పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. మెటాలో చేరిన రెండు రోజులకే నిరుద్యోగిగా మారానని..ఈ ఉద్యోగం కోసం భారత్ నుంచి కెనడా షిఫ్ట్ అయ్యినట్లు హిమాన్షు తెలిపాడు. ఇప్పుడు ఏం చేయాలన్నదానిపై ఐడియా లేదని. కెనడా లేక ఇండియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా అవకాశాలుంటే తెలపండి అంటూ తన లింక్డిన్ ఖాతాలో పోస్ట్ చేసాడు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతనికి కొంత మంది అవకాశాలు తెలియజేస్తుంటే.మరికొందరు ఓదార్పును ఇస్తున్నారు. ఏదేమైనా టెక్ ఉద్యోగుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం వెంటాడుతోంది.



Post a Comment

0Comments

Post a Comment (0)