క్యాన్సర్‌ను చంపే వైరస్‌ !

Telugu Lo Computer
0


వైద్య చరిత్రలో శాస్త్రవేత్తలు మరో అద్భుతాన్ని సృష్టించారు. క్యాన్సర్‌ కణాలను చంపే వైరస్‌నుఅభివృద్ధి చేశారు. జన్యుమార్పిడి చేసిన వైరస్‌ను క్యాన్సర్‌ కణాల్లోకి జొప్పించి, ఆ కణాలు కుంచించుకుపోయేలా చేశారు. ఇంగ్లండ్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ రిసెర్చ్‌, రాయల్‌ మార్స్‌డెన్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ కలిసి క్యాన్సర్‌ కణాలను చంపేందుకు ఓ వైరస్‌లో జన్యు మార్పులు చేశారు. ఆ వైరస్‌ను క్యాన్సర్‌ కణాలు ఉన్న చోట ఇంజెక్షన్‌ ద్వారా జొప్పించారు.ఆ వైరస్‌.. క్యాన్సర్‌ కణాల పనితీరును దెబ్బతీసి, శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేలా చేసింది. అలా మెల్లిమెల్లిగా క్యాన్సర్‌ కణాలు మాయమైపోయాయి. యూకేకు చెందిన క్రజైస్టోఫ్‌ వోజ్కోవ్‌స్కీ (39) లాలాజల గ్రంథి క్యాన్సర్‌తో బాధపడేవాడు. అనేక దవాఖానలు తిరిగినా ఫలితం లేకపోయింది. జీవితంపై ఆశ కోల్పోయిన అతడు.. తనపై 'వైరస్‌ చికిత్స' ట్రయల్స్‌ కోసం రాయల్‌ మార్స్‌డెన్‌ వద్ద పేరు నమోదు చేసుకొన్నాడు. దీంతో అతడి శరీరంలోకి వైరస్‌ను ఎక్కించారు. ఆశ్చర్యకరంగా అతడి క్యాన్స ర్‌ మాయమైపోయింది. మొత్తం 9 మందిపై ట్రయల్స్‌ నిర్వహించగా ఇప్పటికే ముగ్గురు కోలుకొన్నారు. వారిలో మిగతా ఇద్దరు కంటి క్యాన్సర్‌ నుంచి బయటపడ్డారు. మిగతా ఆరుగురిలో ఆశాజనక మార్పు కనిపిస్తున్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)